Saradaga Kasepaina song lyrics in తెలుగు
చిత్రం: పాగల్
సంగీతం: రాధన్
రచయిత: అనంత శ్రీరామ్
గాయకులు: కార్తీక్ మరియు పూర్ణిమ
పాట విడుదల: 31st March 2021
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాళ ఎవ్వరు పంపారే
ఇన్నేళ్ల చీకటి గుండెల్లో…
వర్ణాల వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చెనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడనీ మాటలు
కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో మూటకట్టి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి
తల నిమిరే వేళ్ళ కోసం వెర్రోడినై
వానలకై నేలలాగా వేచా మరి
వందేళ్ల జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారాలలోనే
చుక్కానిలా నువీక్షణం ముందుండి లాగగా
సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే
చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకాసం అంచునే తాకనే నించునే
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో మూటకట్టి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Lyrical Video:- https://youtu.be/sc0QtI6_WWc
Full Video:- https://youtu.be/6rZWK_KEMAw
Comments
Post a Comment