Devudu Karunisthadani Song Lyrics in తెలుగు

చిత్రం: ప్రేమకథ (1999)
గాయకులు: అనురాధ శ్రీరామ్ మరియు రాజేష్ కృష్ణన్
సంగీతం: సందీప్ చౌట
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన
కడదాకా సాగనా

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నా కోసం
ఎవరేమి అనుకున్నా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన
కడదాకా సాగనా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

Day 7 at Gym

Day 3 at Gym

Day 1 at Gym